*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు హర్షం*
*చిత్తూరు పార్లమెంటు పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల ప్రగతికి అడవి తల్లి బాట పథకాన్ని వినియోగిస్తామన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు*
చిత్తూరు (రాధే సింధూరం)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంపచోడవరం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'అడవి తల్లి బాట 2.0' కార్యక్రమం పట్ల చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వెనుకబడిన అటవీ మరియు గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. అదే సమయంలో చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల ప్రగతికి కూడా "అడవి తల్లి బాట" పథకాన్ని వినియోగించుకుంటామని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు మాట్లాడుతూ 'అడవి తల్లి బాట 2.0' ముఖ్య ఉద్దేశాలను మరియు ప్రజలకు కలిగే లాభాలను వివరించారు.అడవి తల్లి బాట 2.0' ముఖ్య ఉద్దేశం రవాణా సౌకర్యాల మెరుగుదల.మైదాన ప్రాంతాలకు దూరంగా, కనీస రహదారి సదుపాయం లేని అటవీ, కొండ ప్రాంతాల గిరిజన గ్రామాలకు పక్కా రోడ్డు కనెక్టివిటీని కల్పించడం. ఈ విడతలో భాగంగా దాదాపు 1,946 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.కళలు, జీవనశైలికి గుర్తింపు.గిరిజన బిడ్డల సంస్కృతి, జీవనశైలి, వారు తయారు చేసే సహజసిద్ధమైన హస్తకళల ఉత్పత్తులకు సరైన విపణి (మార్కెట్) కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం.రాష్ట్ర ప్రజలకు, గిరిజన బిడ్డలకు కలిగే లాభాలు.మెరుగైన వైద్యం, విద్య:రోడ్డు కనెక్టివిటీ పెరగడం ద్వారా అత్యవసర సమయాల్లో గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు సకాలంలో అందుతాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల ప్రయాణం సులువవుతుంది.ఆర్థిక సాధికారత.అటవీ సంపదతో గిరిజనులు తయారు చేసే వస్తువులను నేరుగా పట్టణ మార్కెట్లకు తరలించి మంచి ఆదాయాన్ని పొందే అవకాశం లభిస్తుంది.ఉపాధి అవకాశాలురోడ్ల నిర్మాణ పనులు, స్థానిక గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా స్థానికంగానే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు.ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు స్పందన.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గిరిజన అభ్యున్నతికి, గ్రామీణ వికాసానికి పెద్దపీట వేస్తోంది. గతంలో దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఎన్నో ఏజెన్సీ గ్రామాలకు ఈ 'అడవి తల్లి బాట 2.0' ద్వారా కొత్త మోక్షం కలగబోతోంది. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చిత్తూరు పార్లమెంటు ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన చిత్తూరు పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇటువంటి మౌలిక వసతుల కార్యక్రమాలను మరింతగా ఉపయోగించుకుంటాం" అని ఎంపీ స్పష్టం చేశారు.