చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
మామూళ్ల మత్తు లేక రాజకీయ ఒత్తిడిలా
ఉచిత ఇసుక అనేది ఉత్తి మాటైనా
పేదవాడికి అందని ఉచిత ఇసుక, అక్రమార్కుల అడ్డాలోనే మొత్తం మాఫియా
చీరాల (రాధే సింధూరం ) చీరాలలో అక్రమ ఇసుక మైనింగ్ మాఫియా దందా ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది. పేదలకు ఉచిత ఇసుక అనే మాట తప్పితే ఉచిత ఇసుక అనేది పేదవాడికి అందని ద్రాక్ష లాగే మారింది. అక్రమార్కులకు ఇసుక దందా కాసుల పంట పండిస్తుంది. లారీలలో ట్రాక్టర్లలో ఇసుక దందా కొనసాగుతున్న సంబంధిత అధికారుల కంటికి కనపడటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా యదేచ్చగా అక్రమ ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. అక్రమార్కులకు వరం లాగా మారి ఇసుక దందా కోట్లు కురిపిస్తూ ఉండగా అధికారుల పర్యవేక్షణ కరువైనదే అనేది స్పష్టంగా కనిపిస్తుంది. చీరాల నియోజకవర్గంలోని పెద్దల సహకారంతో బడాబాబులు, సస్పెండ్ కబడిన ఉద్యోగులు కొందరు సహకారంతో అక్రమ ఇసుక దందా మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతుంది. సంబంధిత మైనింగ్ మాఫియా వారి వ్యవహార శైలి నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న మైనింగ్ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో మరొక ప్రత్యేక కథనం మీ రాధే సింధూరం లో