చీరాలని నియోజకవర్గంలో వెంకట్ ఆధ్వర్యంలో నాయకుల అండదండలతో మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతున్న అక్రమ ఇసుక దందా..?

చీరాలని నియోజకవర్గంలో వెంకట్ ఆధ్వర్యంలో నాయకుల అండదండలతో మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతున్న అక్రమ ఇసుక దందా..?

ఉచిత ఇసుక అనేది ఉత్తి మాటగా మారి కొందరికి అక్రమ సంపాదన అడగా మారిందా..?

నిబంధనలకు విరుద్ధంగా యదేచ్చగా ప్రకృతి వనరులకు భంగం కలిగిస్తూ తొవ్వేస్తున్న ఇసుకాసురులు..

చీరాల (రాధే సింధూరం ) అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు చేపడతాము అని అధికారులు మాట ఉత్తి మాటగానే మారి, కొందరు బడా బాబులు జేబులు నింపుతున్న మాట వాస్తవం. సంబంధిత బాబులకు అండగా రాజకీయ నేతల అండదండలతో ఇసుక వ్యాపారం ఆడిందే ఆటపాడింది పాటగా కొనసాగుతుంది. చీరాల నియోజకవర్గ పరిధిలో అక్రమ ఇసుక మైనింగ్ వ్యాపారం అర్ధరాత్రి ప్రతిరోజు యదేచ్చగా వాహనాలలో తరలిస్తున్నారు కానీ సంబంధిత అధికారులు కంటికి కనబడటం లేదు.దృష్టి సారించినట్లు ఉపోద్ఘాటించారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ డ్యామేజ్‌ టు పబ్లిక్‌ ప్రాపర్టీ (పీడీపీపీ) చట్టం, మైన్‌ అండ్‌ మినరల్స్‌ చట్టం ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని చెప్పే అధికారులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు. రాజకీయ ఒత్తిడిలా లేక అధికారులకు అందుతున్న మామూలు అనేది తెలియడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సైతమే జిల్లాలో మైనింగ్ పట్ల అసహనం వ్యక్తం చేయగా, సంబంధిత అధికారులు మైనింగ్ మాఫియా పై చర్యలు తీసుకో పోవడంతో, మాఫియా ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. చీరాల నియోజకవర్గంలో వెంకట్ ఆధ్వర్యంలో రాజకీయ నాయకులు, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహకారంతో పేదవాడికి ఇసుక అనేది అందని ద్రాక్షగా మారింది. అక్రమ ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్న బాబులపై, వారికి అండగా ఉంటున్న అధికారులపై నాయకుల పై మరొక ప్రత్యేక కథనం మీ రాధే సింధూరంలో