..

అక్రమ రేషన్ సంపాదనతో లక్షలుగడిస్తున్న వేమూరు పిడిఎఫ్ డాన్ ఆ రాజకీయ నాయకుల అండ ఏమిటి?

జిల్లాలకు తరలిపోతున్న సరుకు,కేరాఫ్ అడ్రస్ గా మారిన వేమూరు అడ్డ

తనిఖీలు చేస్తున్న విధంగా నటిస్తున్న ఆ అధికారి ఎవరు..?

అధికార పార్టీ నేతల ఆశీస్సులు ఉన్నాయంటూ వేమూరు డాన్ బెదిరింపులు

రేత్రి సరుకు మారుస్తూ ప్రభుత్వాన్ని పక్క దావ పట్టించటంలో సిద్ధహస్తుడు

వేమూరు (రాధే సింధూరం)జిల్లాలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం వినియోగించడానికి లబ్ధి దారులు ఆసక్తి చూపడం లేదా, అంటే బియ్యం పనికిరావు తినటానికి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్న వేమూరు అక్రమ రేషన్ దారుడు . నియోజకవర్గం నుంచి దాదాపు 60 శాతం రేషన్‌ బియ్యం తిరిగి మార్కెట్‌కు తరలిపోతోంది. పలు నియోజకవర్గాల నుంచి, వేమూరు అడ్డాగా చేసుకుని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుండగా అక్కడ నుంచి సీఎంఆర్ మిల్లులకు ఎగుమతి అవుతోంది.గతంలో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి కొనుగోలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. జిల్లాలోనే కొత్త ముఖాలు దళారులు అవతారమెత్తాయి. అధికార పార్టీ నేతలే తమకు అండ అంటూ బరి తెగిస్తున్నారు . అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గం నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి సీఎంఆర్ మాటను పక్క నియోజకవర్గాలకు పంపుతూ అవే బియ్యాన్ని మళ్లీ మార్కెట్‌లో వచ్చేటట్లు చేస్తున్నారు. దళారులు కిలోకు రూ. 14 ఇస్తున్నారు. వారు మాత్రం పాతిక రూపాయలకి అమ్ముకుంటున్నారు.కొందరు లబ్ధిదారులు డీలర్ల వద్దే రేషన్‌ ఉంచేస్తున్నారు. సొమ్ములు తీసుకుంటున్నారు. డీలర్‌ల నుంచి కూడా దళారులే బియ్యాన్ని సేకరిస్తు, ఆ సరుకు మొత్తం మిల్లర్లకు పంపే విధంగా కోటి అర్థరాత్రి ప్రణాళికలో రాసిస్తూ అక్రమ రేషన్ వ్యాపారంలో కొత్త పంధలో పుంతలు తొక్కుతున్నాడు. వేమూరు అంటే అక్రమ రేషన్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ గా సీనయ్య ఉన్నాడు అనడంలో సందేహమే లేదు. వేమూరు నియోజక వర్గం అడ్డాగా కోటి చేస్తున్న అక్రమ రేషన్ దందాపై మరొక ప్రత్యేక కథనం