..

నిఘా నిద్రపోతుంటే దఘూ దండుకుంటుంది..?

ఇసుక బకాసురులపై చర్యలు ఉంటాయా ఉండవా..?

కొల్లూరు మండలం లో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్టపడేది ఎప్పుడు..?

సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయనే మాటల్లో వాస్తవం ఎంత...?

బాపట్ల(రాధే సింధూరం ) అక్రమ ఇసుక రవాణాకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఇసుక మాఫియా దెబ్బకి నదులు వాగులు వంకలు సరిపోవటం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించిన బాపట్ల జిల్లా కొల్లూరు మండలం లో ఇసుక మాఫియా ఆగడాలకు అధికారులు నాయకులు వారి ముడుపుల ప్రభావంతో సలాం కొట్టారు అనడంలో సందేహమే లేకుండా పోయింది. ఇసుక అక్రమ దందా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. అక్రమ ఇసుక దందా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. భారీ స్థాయిలో టన్నుల కొద్ది ఇసుక లారీలలో మాయమవుతుంటే అధికారులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో అధికారుల సహకారంతో కొనసాగుతుందా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అక్రమ ఇసుక రవాణా అరికట్టవలసిన మైనింగ్ పోలీస్ రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు. సంబంధిత నిర్వాహకులు వారి అవినీతిపై ప్రత్యేక కథనం రేపటి సంచిక లో