***

కుప్పం ( రాధే సింధూరం) పీ-4 (P-4) కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని బంగారు కుటుంబాలతో ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.కుప్పం నియోజకవర్గ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో కలిసి పాల్గొన్నారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.పథకాల అమలు తీరు మరియు నియోజకవర్గ అభివృద్ధి పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఇందులో కూడా ఏపీ సీఎం గారితో కలిసి పాల్గొన్నారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.నియోజకవర్గ ముఖ్య నేతలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఏపీ సీఎం చంద్రబాబు గారు సమావేశమై స్థానిక రాజకీయాలు, పార్టీ బలోపేతం పై చర్చించి, తెలుగు తమ్ముళ్లకు మార్గనిర్దేశం చేసిన కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొన్నారు.అంతకు ముందు ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో కలిసి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొన్నారు.