అక్రమ రేషన్ దందా యదేచ్ఛగా కొనసాగిస్తున్న కొల్లూరు కార్తీక్, చుండూరు నాని లపై చర్యలు ఎప్పుడు .?
అక్రమ రేషన్ బియ్యం దందాకు విజయేంద్రుడికి నెలవారీ ముడుపులు అందిస్తున్నాం అంటున్న మాఫియా నాయకుల మాటల్లో నిజం ఎంత..?
రేషన్ బియ్యం రాత్రికి రాత్రే మిల్లులకు తరలింపు, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న నిఘా నేత్రాలు
అధికారుల అండతో కోట్ల దోపిడీ. అండగా విజయేంద్రుడు హస్తం వెనకాల నిజమెంత ..?
అక్రమ రేషన్ దందాలో ప్రజా ప్రతినిధులు, అధికారుల పాత్ర ఎంత....?
ముఖ్యమంత్రి ఆశయాలను తుంగలో తొక్కుతున్న కేటుగాళ్లు వారికి అండగా ఆ ప్రజా ప్రతినిధి సహాయకుడు...?
వేమూరు జులై 10 (రాధే సింధూరం బ్యూరో చీఫ్) వేమూరు నియోజకవర్గం చుండూరులో, కొల్లూరులో, అమృతలూరు లో అక్రమ రేషన్ బియ్యం దందా వ్యాపారం కార్తికేయుడు, నానీలపై అధికారు లు చర్యలు తీసుకోవటానికి ఎందుకు వెనకాడుతున్నారు. నిఘా నేత్రాలు పరిశీలిస్తే సంచలన విషయాలు బయటకు నమోదు అవుతాయి. నెలవారీ ముడుపులు అందుకుంటున్న విజయేంద్రుడి సహకారం, అధికారుల అండదండలు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న విధానం వేమూరు నియోజకవర్గం లో కనబడుతుంది.పేదవాడి ఆకలి చావులతో వ్యాపారం నిర్వహిస్తూ, చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వ రేషన్ బియ్యం భారీ ఎత్తున అక్రమంగా తరలించి సమీపంలో ఒక ప్రధాన రైస్ మిల్లుల్లో అనునిత్యం అక్రమ రేషన్ దందా నిర్వహిస్తున్నారు వ్యాపారులు,రేషన్ కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యాన్ని డీలర్లు, మిల్లు యజమానులు కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారు.ప్రజలకు స్టాకు లేదని, ఇతర ఇతర కారణాలు చెప్పి ఎంతో కొంత ముట్ట చెప్పి , కార్డుదారులను ఇంటికి పంపి,అదే బియ్యాన్ని రాత్రి వేళల్లో లారీల్లో మిల్లులకు తరలిస్తున్నారు.అక్రమ రేషన్ దోపిడీవిధానం...నియోజకవర్గంలో కొందరు రేషన్ డీలర్లు కిలో 10 నుండి 15 రూపాయలకు కార్డుదారుల నుండి బియ్యాన్ని కొంటున్నారు.ప్రభుత్వ ముద్ర ఉన్న బస్తాలను చింపి కొత్త బస్తాల్లోకి మారుస్తున్నారు.రాత్రి రవాణా : అర్ధరాత్రి తర్వాత పెద్ద పెద్ద లారీల్లో ఈ బియ్యాన్ని అక్కడ కిలో 30 నుండి 40రూపాయలకు అమ్మి కోట్లు గడిస్తున్నారు.అధికారులు ఏం చేస్తున్నారు...? నియోజకవర్గంలో బహిరంగంగా రేషన్ దందా జరుగుతుంటే సంబంధిత, పౌరసరఫరాల శాఖ అధికారులు ఎందుకు చూసీచూడనట్లు ఉంటున్నారు..? అక్రమ రేషన్ వ్యాపారులు మాట్లాడుతూ నియోజకవర్గంలో అక్రమ రేషన్
ఆపేదే లేదు.ఉన్నతాధికారులకు నెల వారి మామూళ్లు ముడుపుల రూపంలో పంపుతున్నాము మా రేషన్ సీజ్ చెయ్యటకి ఎవరు రారు అంటూ ఖరాఖండిగా చెప్తున్నారు కొందరు అక్రమ రేషన్ వ్యాపారులు..తక్షణ డిమాండ్,జిల్లా కలెక్టర్, జిల్లా సరఫరా శాఖ అధికారులు వెంటనే పరిసరాల్లో ఉన్న రైస్ మిల్లులపై దాడులు నిర్వహించాలి, ఇటీవల అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపిన అవి నామమాత్రంగానే ఉన్నాయి.అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసి పేదలకు పంచాలి.ఈ దందాలో ఉన్న డీలర్లు, మిల్లు యజమానులు, అధికారులు ఎవరు అయినా సరే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చుండూరు నాని, కొల్లూరు కార్తీక్, అమృతలూరు అక్రమ రేషన్ దొంగలు పై కఠిన చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత కలదు. సంబంధిత కొల్లూరు కార్తికేయుడు పై పలు అవినీతి ఆరోపణలతో కుటుంబ సభ్యులతో అక్రమ రేషన్ బియ్యం దందా నిర్వహిస్తూ ఇంట్లో, ఊరు చివర గూడెంలో నిల్వలు చేస్తూ వ్యాపార నిర్వహణ కొనసాగిస్తున్న వైనం అధికారులకు తెలిసిన మౌనం వహిస్తున్న విధానం పట్ల ప్రజల ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరుగుతుంది. సంబంధిత మాఫియా వారి అవినీతి బాగోతం పె మరొక ప్రత్యేక కథనం