...

*10వేలు ఆర్థిక సహాయాన్నందించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ*

*కృతజ్ఞతలు తెలియజేసిన విద్యార్థిని తల్లిదండ్రులు*

చిత్తూరు(రాధే సింధూరం)టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పేద విద్యార్థినికి చేయూతనందించారు. పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.చిత్తూరు నగర పరిధిలోని 25వ డివిజన్ కుక్కల పల్లిలో నివాసముండే వడ్డెర సామాజిక వర్గానికి చెందిన గోవిందరాజుల కుమార్తె చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ రెండవ సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. అయితే వీరిది నిరుపేద కుటుంబం. బతుకు బండి బారంగా మారిన గోవిందరాజులుకు తన కుమార్తెను చదివించడం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు విషయాన్ని, చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావుకు చేరవేసొరు. స్పందించిన ఎంపి దగ్గుమళ్ళ,.. నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు.పేదవిద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన ఆ కుటుంబానికి భరోసానిచ్చరు.తమకు బాసటగా నిలిచిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావుకు గోవిందరాజుల కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసింది.