..

బాపట్ల (రాధే సింధూరం) 10వ సచివాలయం పరిధిలోని రాజ్యలక్ష్మి నగర్ ప్రాంతంలో జరుగుతున్న ప్రధాన డ్రెయిన్ డీసిల్టింగ్ పనులను కమిషనర్ పరిశీలించారు. పనుల నాణ్యత, వేగం మరియు నిర్వహణపై సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.అనంతరం 19 వ వార్డు మార్కెట్ ప్రాంతంలో పారిశుధ్య పనులను పరిశీలించి,కార్మికులతో నేరుగా మాట్లాడి వార్డు వారీగా ప్రతిరోజూ నిర్వహిస్తున్న పనుల గురించి వివరాలు తెలుసుకున్నారు.పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో శానిటేషన్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, తమ బాధ్యతలను క్రమంగా నిర్వర్తించాలని సూచించారు.తదుపరి అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన కమిషనర్ , అక్కడి భోజన నాణ్యతను పరిశీలించి ప్రజలతో మాట్లాడి ఆహారం రుచి, అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి యస్.మల్లిఖార్జున రావు,SGSW మేనేజర్ కె.రాధ అధికారులు పాల్గొన్నారు.