బాపట్ల( రాధే సింధూరం)బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు ని బాపట్ల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్" (NWC) సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నివారణ కోసం కౌన్సిల్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వివరించారు. కౌన్సిల్ ప్రతినిధులతో మాట్లాడిన ఎమ్మెల్యే,బాపట్ల జిల్లాను పచ్చదనంతో నింపేందుకు మరియు కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చేస్తున్న కృషిని అభినందించారు. సంస్థ చేపట్టే ప్రతి పర్యావరణ కార్యక్రమానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ బాపట్ల జిల్లా నూతన చైర్మన్‌గా నియమితులైన స్థానిక శ్రీ భావపురి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఆవుల వెంకటేశ్వర్లుని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో పర్యావరణ చైతన్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో NWC జిల్లా సభ్యులు గురజాల శ్రీనివాసరావు, గొల్ల ఏకాక్షరి, ఇంకొల్లు పోలీస్ రావు, ఉప్పె నరసింహారావు, పొందుగుల ప్రసాద్ రావు, కుర్రా భగవాన్, తడికమళ్ళ నాగేంద్ర ప్రసాద్, పాలేరు వీరాస్వామి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.