బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్*... విద్యతోనే అంటరానితనం నిర్మూలన రాజ్యాంగ నిర్మాత బాటలోనే ఎంపీ సీయం చంద్రబాబు హక్కులు, ప్రయోజనాల సాధన కోసం ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వాల పై ఒత్తిడి తీసుకురావాలి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు,చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

చిత్తూరు(రాధే సింధూరం)బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని రకాల అభివృద్ధి చెందాలని, విద్యను అభ్యసించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు
వీలవుతుందని తన రాజ్యాంగం ద్వారా భావితరాలకు దిశా నిర్దేశం చేసిన మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్ అని ఆ మహానుభావుని దూరదృష్టిని స్మరించుకున్నారు.
విద్యతోనే అంటరానితనాన్ని నిర్మూలన సాధ్యమని వారు సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, ఎస్సీ ఎస్టీలు తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారు ఉద్బోధించారు.దళిత సంక్షేమ సేవా సంఘం పదవ వార్షికోత్సవం సందర్భంగా తిరుపతిలోని కక్షపి కళాక్షేత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అలాగే రాజ్యాంగం పై ఎస్సీ ఎస్టీలకు అవగాహన కల్పించారు. అంతకుముందు తిరుపతి తుడా ప్రాంగణంలోని కక్షపి కళాక్షేత్రానికి చేరుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే పులివర్తి నానికి, దళిత సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆ సంఘం సభ్యులు పుష్పగుచ్చాలందించి సాదర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రారంభమైన సమావేశానికి ముందు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి జోహార్ అంబేద్కర్ అంటూ ఘన నివాళులర్పించారు ఎంపీ, ఎమ్మెల్యేలు.అనంతరం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నత కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వారి జీవితాలలో వెలుగులు నింపడమే కాకుండా, ప్రపంచ దేశాలచే ప్రశంశలందుకుంటోందని తెలియజేశారు. ఆ రాజ్యాంగం వల్లే తాము చట్టసభల్లో అడుగుపెట్టగలిగామని, ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఎన్నో అంశాలు భారతదేశానికి దిక్సూచిగా మారాయని పేర్కొన్నారు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలవడం మనందరికీ గర్వకారణం అన్నారు. రాజ్యాంగం వల్లే ప్రభుత్వాలు ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు.రాజ్యాంగ నిర్మాత బాటలోనే ఎంపీ సీయం చంద్రబాబు నాయుడు పయనిస్తూ.. గత ప్రభుత్వంలో నిర్వీరమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నారని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళితులకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారని, ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. మహిళా సాధికారత కోసం,మహిళలకు ఆస్తి హక్కు, సమాన హక్కుల సాధన కోసం హిందూ కోడ్ బిల్లు ద్వారా కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన గొప్ప న్యాయవాది, ఆర్థికవేత్త, చరిత్రకారుడు, మరియు సంఘ సంస్కర్త. గొప్ప విద్యావంతుడు: ప్రపంచంలోనే అత్యున్నత డిగ్రీలు సాధించి, జ్ఞానంతోనే సామాజిక మార్పు సాధ్యమని నిరూపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. తమ హక్కులు, ప్రయోజనాల సాధన కోసం ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వాల పై ఒత్తిడి తీసుకురావాలనీ, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అప్పుడే ఆ మహనీయునికి మనమిచ్చే ఘనమైన నివాళి అని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు.చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా, ప్రపంచ మేధావిగా ఎనలేని గుర్తింపు పొందిన మహోన్నత శక్తి అని కొనియాడారు. అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగి, పీడిత వర్గాల విముక్తి కోసం పోరాడిన బాబాసాహెబ్ దేశ చరిత్రలో నిలిచిపోయ్యారని తెలియజేశారు. స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించి, ప్రజాస్వామ్య విలువలను, సమన్యాయాన్ని పొందుపరిచి,
సామాజిక సమానత్వం, కుల నిర్మూలన, అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన దళిత బాంధవుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని ప్రశంసించారు. దళితులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పులివర్తి నాని అన్నారు.