.
బాపట్ల (రాధే సింధూరం )బాపట్ల పట్టణంలోని ప్రముఖ కూడలి అయిన చీలు రోడ్డు సెంటర్ వద్ద దివంగత ప్రముఖులు గరుడాచలం నాయుడు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు ముఖ్య అతిథిగా హాజరై, విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో బాపట్ల నియోజకవర్గ కూటమి నాయకులు, వివిధ పార్టీల ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.