_అపర దాన కర్ణుడు, అందరివాడు గరుడాచలం నాయుడిని కొందరు వాడిని చేశారా ..!
_పేరం గరుడాచలం నాయుడు విగ్రహ ఏర్పాటులో విన్నకోట సురేష్ కృషి మరువలేనిది
_ఆయన రాకపోవటం పట్ల భిన్నభిప్రాయాలు..
_మహనీయుడి విగ్రహం సాక్షిగా స్వార్థరాజకీయాలు,మండిపడుతున్న అభిమానులు
బాపట్ల, (రాధే సింధూరం)బాపట్ల నియోజకవర్గ పరిణామాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. పేద ప్రజల పెన్నిధి, దాతృత్వానికి మారుపేరు అయిన పేరం గరుడాచలం నాయుడు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కుమ్ములాటలను బట్టబయలు చేసింది. అహర్నిశలు కష్టపడి విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన విన్నకోట సురేష్ పట్ల జరిగిన 'వెన్నుపోటు,' అందరివాడు గరుడాచలం నాయుడుని కొందరువాడిగా మార్చిన వైనం పట్ల ప్రజల ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది.ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.విన్నకోట సురేష్ గత కొంతకాలంగా పేరం గరుడాచలం నాయుడు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, ఆయన విగ్రహాన్ని బాపట్ల నడిబొడ్డున ప్రతిష్టించాలని సంకల్పించారు. తూర్పు సత్రం వద్ద ఉన్న చెత్తాచెదారాన్ని తన సొంత నిధులతో తొలగించి, స్థలాన్ని సుందరీకరించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ కలిసి విరాళాలు సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. ఇంతా చేసి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత, ఆదివారం జరిగిన ఆవిష్కరణ మహోత్సవంలో కనీసం ఆయన పేరు లేదు. ఆయన రాకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యంగా విగ్రహావిష్కరణ సమయంలో కొందరు మాట్లాడిన తీరు కొందరు ప్రజలకు ఇబ్బందికరంగా మారి అది ఒక తీవ్ర స్థాయి చర్చకు మారింది. ఆ విధానం అందరూ వాడిని కొందరు వాడిని చేసిందా..? కష్టపడే నాయకుడికి గుర్తింపు లేదు, ఆహ్వానితుల్లో ఆర్డర్ లేదు అని కొందరు, ఒక వర్గానికే పరిమితం చేసే విధంగా మాట్లాడిన విధానం,దాన కర్ణుడు గరుడాచలం నాయుడు విగ్రహం సాక్షిగా ఈ విధంగా చెత్త రాజకీయాల పట్ల ప్రజలు, విశ్లేషకుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయటం జరుగుతుంది. గతంలోనూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్న బాపట్లలో ఒక వ్యక్తి మాట్లాడిన విధానం, కుల రక్కసి ప్రోత్సహించే విధంగా మాట్లాడుతూ ఉన్న విధానం, కొందరికి ఇబ్బందికరంగా మారుతుంది. ఇది భవిష్యత్తులో బలపడాలనుకుంటున్న పార్టీకి ఇబ్బందికరమని, ఈ విధంగా మాట్లాడే వారిపై అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని, పై స్థాయిలో కష్టపడే నాయకుడు ఆశయాలకు అనుగుణంగా కింద స్థాయిలో వ్యక్తులు ఉండాలని,ప్రజలు కోరుకుంటున్నారు.