- చిత్తూరు(రాధే సింధూరం )చిత్తూరు జిల్లా వి. కోట మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం పై చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా భావించే జర్నలిస్టుల పై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎస్పీతో చర్చలు. తక్షణ అరెస్టులకు ఆదేశం.ఈ ఘటనపై ఎంపీ వెంటనే స్పందిస్తూ జిల్లా ఎస్పీ డూడీతో ఫోన్లో మాట్లాడారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులు ఎంతటి వారైనా సరే, ఉపేక్షించకుండా వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని ఎస్పీని కోరారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.బాధిత కుటుంబానికి భరోసా.జగన్మోహన్ రెడ్డి అకాల మరణం ఆయన కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు.వృత్తిపరమైన విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు స్పష్టం చేశారు.