బాపట్ల (రాధే సింధూరం )రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోందని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని 9వ వార్డు, మూర్తి రక్షణ నగర్ పరిధిలో జరిగిన 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, ఆప్యాయంగా పలకరించి వారికి పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,గతంలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు పడ్డ కష్టాలను తొలగించి, నేడు గౌరవప్రదంగా ఇంటి వద్దకే రూ. 4,000 పింఛన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పవన్ కళ్యాణ్ మద్దతుతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నాయని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి , బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాశ్ నారాయణ,బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ ముంగిటకే వచ్చి పెన్షన్ అందించిన ఎమ్మెల్యే గారికి మరియు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.