గుంటూరు(రాధే సింధూరం )గుంటూరు-1 వన్ టౌన్ పరిధిలోని నవభారత్ కాలనీ మెయిన్ రోడ్డు టి ఎన్ టి యు సి గుంటూరు -1 అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు,,ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్ డ్రైవర్స్ యూనియన్, ఆటో డ్రైవర్స్ యూనియన్ వారి స్టాండ్ ల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానితులు గుంటూరు -1 ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, గుంటూరు -1టి ఎన్ టి యు సి అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ షేక్ గఫ్ఫార్, జనరల్ సెక్రెటరీ కిరణ్ కుమార్, టి ఎన్ టి యు సి కమిటీ సభ్యులు కలసి మొత్తం 4 చోట్ల జండాలు ఆవిష్కరించటం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు, కార్మిక శాఖ మంత్రి ఆదేశాల మేరకు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందాలంటే గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం గుంటూరు-1 టి ఎన్ టి యు సి అధ్యక్షులు కొల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ...భవన నిర్మాణ కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి టి ఎన్ టి యు సి గుంటూరు-1 అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు.. వారికి వివరించారు.వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి సహాయంగా రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్య క్రియలకు రూ.20 వేలు అందించే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ఈ నాలుగు సంక్షేమ పథకాలను పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయాలని నిర్ణయించారని, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాకు డబ్బులు జమచేసే విధంగా అమలు చేయడం జరుగుతోందని వివరించారు. ఈ
సంక్షేమ పథకాలకు అర్హులైన భవన నిర్మాణ రంగ కార్మికులు తమ గుర్తింపు కార్డు, ఇతర దృవీకరణ పత్రాలతో స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయం
డిజిటల్ సెక్రటరీ, ఎడ్యుకేషనల్ సెక్రటరీల ద్వారా ఆర్జీ దాఖలు చేయవచ్చని సూచించారు. జిల్లాలో భవన నిర్మాణ రంగంలో పనిచేసే 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు గల కార్మికులందరూ దగ్గరలోని కార్మికశాఖ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు కార్డు పొందాలని, ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే టిఎన్ టియుసి కార్యాలయం నవభారత్ నగర్ లో అడిగి తెలుసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం గుర్తింపు కార్డు కలిగిన భవన నిర్మాణ కార్మికులు తమ గుర్తింపు కార్డును నవీకరించుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పార్టీ కండువాలను కప్పి దృశ్యాలువాలతో ఘనంగా సత్కరించి, ప్రతి ఒక్కరికి మిఠాయిలను, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోటమ నాయకులు టి ఎన్ టి యు సి సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.