*ఏపీ సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ బాబు ఆదేశాలకు అనుగుణంగా పని చేయడమే మా కర్తవ్యం*
*కొన్ని విషయాలు మా ప్రమేయం లేకుండానే జరగడం దురదృష్టకరం*
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు*
చిత్తూరు(రాధే సింధూరం)ఇటీవల చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి, సమస్యను పరిశీలించి, న్యాయం చేయమని అధికారులకు సూచించినట్లు చెప్పారు పొలిట్ బ్యూరో సభ్యులు,చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్కు తనకు మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి, యువనేత నారా లోకేష్ బాబు ఆదేశాలకు అనుగుణంగా.., అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. కొన్ని విషయాలు తమ ప్రమేయం లేకుండానే జరగడం దురదృష్టకరమని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు.రెండు రోజులుగా చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తా కథనాలను ఆదివారం చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్తో కలిసి ఆయన ఖండించారు.చిత్తూరు ఎంపీగా తాను , ఎమ్మెల్యేగా గురజాల జగన్ మోహన్ ఇరువురం సమన్వయంతో ప్రజా శ్రేయస్సు కోసం కలిసి పనిచేస్తున్నామనన్నారు.
అభివృద్ధే తమ ధ్యేయమని ఉద్ఘాటించారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.చిత్తూరు నియోజకవర్గ ప్రగతే మా అజెండా..పార్టీలో గానీ, ఎంపీకి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు.చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు నాకు తండ్రి లాంటి వారు. చిత్తూరు నియోజకవర్గాన్ని ప్రశాంతతకు మారుపేరుగా నిలిపాము.నగరపాలక సంస్థలో నెలకున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపాము.మీడియాలో వచ్చిన వార్తా కథనాలు మమ్మల్ని బాధించాయన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పూర్తి,.. రాష్ట్ర మంత్రి, యువనేత నారా లోకేష్ బాబు మార్గనిర్దేశంలో చిత్తూరు నియోజకవర్గ ప్రగతే మా అజెండాగా తాము పనిచేస్తున్నామని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ తెలియజేశారు. తెలుగు దేశం పార్టీలో గానీ, ఎంపీకి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తాను బెంగుళూరు, ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు హైదరాబాద్లో ఉన్న సమయంలో మీడియాలో వచ్చిన వార్తా కథనాలు తమని తీవ్రంగా బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరపాలక సంస్థలో నెలకున్న సమస్యకు తాము పుల్ స్టాప్ పెట్టామని, సమన్యాయం చేయడంలో సక్సెస్ అయ్యామన్నారు.
చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తనకు తండ్రి లాంటి వారు అని చెప్పిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.., ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటుకు ఎంపీగా రావాలని కోరుకున్న వారిలో తాను మొదటి వ్యక్తినన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు దగ్గుమళ్ళ ప్రసాదరావు తన ఎంపీ నిధులను చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించి, సహకరించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
తాము నియోజకవర్గంలో లేని సమయంలో నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఓ చిన్న ఘటన తమ ప్రమేయం లేకుండా చాలా పరిణామాలకు దారితీసిందని, ఈ విషయమై తాను, ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు కలిసి సమాలోచనలు జరిపి సమస్యకు పరిష్కారం మార్గాన్ని చూపామని ఆయన తెలిపారు.భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని.., కలిసి పనిచేస్తామని మరోసారి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఉద్ఘాటించారు.