..

కరోనా టైం కంటే దారుణంగా కొన్ని కుటుంబాల పరిస్థితి
పల్లెల్లో పరిస్థితులు దారుణం, పగుళ్ళతో బీటలు వారిన భూములు
అత్యవసర పరిస్థితిని చూసి ఆదుకోండి అంటున్న ప్రజలు
ఎలినోన్ ప్రభావం, కరువు విలయతాండవం చేస్తుంది ...
ప్రస్తుత తరం పర్యావరణాన్ని కాపాడుకుంటూ, భావితరానికి పర్యావరణ పరిరక్షణ బాధ్యత తెలియజేద్దాం
భావితరానికి ప్రకృతిని గురించి, చెట్ల పెంచవలసిన ఆవశ్యకత ను తెలుపుదాం
అమరావతి (రాధే సింధూరం ) సరైన సమయానికి వర్షాలు లేక బీడువారిన భూములను చూసి రైతులు బోరున విలపిస్తున్న వైనం కనిపిస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కరోనా టైం కంటే కొన్ని కుటుంబాల పరిస్థితి చాలా దారుణ పరిస్థితిలో బ్రతుకు జీవుడా అంటూ వల్ల వేస్తున్న వైనం ప్రజలలో కనబడుతుంది. ఇదే విధంగా కొనసాగితే మనిషి బ్రతుకుడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎంత ప్రకృతిని కాపాడుకుంటే అంతగా విపత్తుల నుంచి తప్పుకోవచ్చు . మనిషి అన్నవాడు మనుగుడ సాగించాలంటే ప్రకృతి పట్ల ప్రేమగా ఉంటూ పర్యావరణాన్ని కాపాడుతూ, కాలుష్యాన్ని నియంత్రిస్తూ మన మనుగుడకు మనమే సహకరించుకోవలసిన ఆవశ్యకత కలదు. ఒక చెట్టు నరికితే 10 చెట్లు నాటాలి ఇది మన బాధ్యత అనే ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా నేర్చుకోవలసిన ఆవశ్యకత కలదు. నీరు లేకపోతే వ్యవసాయం లేదు. నీరు, వ్యవసాయం అనేది లేకుంటే మనిషి మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతుందనేది సమస్య లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛమైన గాలి దొరకని పరిస్థితి మెజార్టీ పట్టణాలలో కనబడుతుంది. చెట్లు ఉంటే ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి సహకరిస్తే నీరు పంటల పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత తరుణంలో పాఠ్యాంశాలలో మన భావితరానికి వ్యవసాయం గొప్పతనం, నీరును పొదుపు చేయవలసిన ఆవశ్యకత, పర్యావరణం పై బాధ్యత తెలుపుతూ తగిన చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఎలినినో ప్రభావం దృష్ట్యా తగిన జాగ్రత్తలు వహిస్తూ పేదవాడి బండి సాగటానికి తగిన విధంగా నిత్యవసర వస్తువులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత కలదు.వర్షాభావంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టవలసిన చర్యలు... వెంటనే కరువు మండలాల ప్రకటన,రైతులకు తక్షణ పరిహారం,తాగునీటి ఎమర్జెన్సీ ప్లాన్,ఉపాధి హామీ పనులు రెట్టింపు, పశువులకు గ్రాసం, నీరువిద్యుత్ కోతలు లేకుండా చూడాలి,పంటల బీమా వేగవంతం,వలసలు నివారణకు చర్యలు,దీర్ఘకాలిక ప్రణాళిక,హెల్ప్ లైన్ ఏర్పాటు చేపట్టా లి. అలాగే భావితరానికి వ్యవసాయం ద్వారా పంటలు, పంటల ద్వారా భూమి మీద మనుగడ ప్రతిదీ తెలిసే విధంగా పాఠ్యాంశాలలో చేర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు.

ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మన తరాన్ని,భావితరాన్ని కాపాడుతుంది
*రాధే సింధూరం తరపున అభ్యర్థ న* కరువును రాజకీయం చేయకుండా అన్ని పార్టీలు కలిసి అఖిలపక్ష సమావేశం పెట్టి, కేంద్రం నుండి తక్షణ సాయం తేవాలి. లేదంటే పేద ప్రజల ఆకలి చావులు తప్పవు.